Filtrer par genre
మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)

- 31 - Ep-31 భీష్మ పర్వం — అర్జున విషాద యోగంThu, 24 Sep 2026 - 14min
- 30 - Ep-30 కుంతి — కర్ణుడి కలయిక — కురుక్షేత్రానికి బయలుదేరిక
గంగా తీరంలో తల్లీ కొడుకుల విషాదమైన కలయిక — కుంతి కర్ణుడిని వెతుకుంటూ వచ్చింది! "నేను మైత్రి వదలలేను అమ్మా!" — కానీ కర్ణుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు!
భీష్ముడు కర్ణుడిని సభలో విమర్శించాడు — కర్ణుడు తీవ్రమైన ప్రతిజ్ఞ చేశాడు! పాండవులకు ధృష్టద్యుమ్నుడు, కౌరవులకు భీష్ముడు సర్వసేనాధిపతులయ్యారు!
18 అక్షౌహిణుల మహాసేన కురుక్షేత్రంలో కూడింది! యుద్ధానికి ముందు రాత్రి — ఉలూక దౌత్యంతో దుర్యోధనుడి రెచ్చగొట్టే మాటలు!
ఉద్యోగ పర్వం ముగింపు — భీష్మ పర్వం నాంది!
మహాభారత గాథ | ఉద్యోగ పర్వం ముగింపు | Episode 30
Thu, 17 Sep 2026 - 11min - 29 - Ep-29 కృష్ణ రాయబారం — విశ్వరూప దర్శనం — కర్ణుడి రహస్యం
ద్రౌపది విప్పుకున్న జుట్టుతో కృష్ణుడికి చెప్పిన ఆవేదన — "నా మానానికి న్యాయం కావాలి!"
కృష్ణుడు దుర్యోధనుడి రాజభోగాలు వదిలి విదురుడి ఇంట్లో ఆకుకూరలు తిన్న అద్భుత ఘట్టం!
కౌరవ సభలో శాంతి ప్రతిపాదన — దుర్యోధనుడి తిరస్కరణ — కృష్ణుడు విశ్వరూపం చూపించిన మహోన్నత క్షణం! భీష్ముడు, ద్రోణుడు, విదురుడికి మాత్రమే దర్శనమిచ్చిన దివ్య రూపం!
మరియు కర్ణుడికి అతని జన్మ రహస్యం చెప్పిన విషాదమైన సంభాషణ — "నేను మైత్రి వదలలేను కృష్ణా!"
Thu, 10 Sep 2026 - 14min - 28 - Ep-28 రాయబారం — కృష్ణుడి నిర్ణయం
సూది మొన మోపినంత నేల కూడా ఇవ్వను!” — దుర్యోధనుడి తవ్రమైన తిరస్కరణతో రాయబారం విఫలమైంది!
నకుల సహదేవుల మేనమామ శల్యుడు పాండవుల వైపు వస్తుండగా — దుర్యోధనడు తెలివైన ఆతిథ్యంతో మోసగించి తన వైపు తిపకున్నాడు!
అర్జునుడు, దుర్యోధనడు ఒకే రోజు కృష్ణుడి దగ్గరిక వెళ్ళారు — దుర్యోధనుడు తలవైపు కూర్చున్నాడు, అర్జునుడు పదాల వద్ద నిలబడ్డాడు! పది లక్షల నారాయణి సేన వదిలి అర్జునుడు ఒంటర కృష్ణుడిని ఎంచుకున్న చారిత్రాతక నిర్ణయం!
మహాభారత గాథ | ఉద్యోగ పర్వం | Episode 28
Thu, 03 Sep 2026 - 12min - 27 - Ep-27 సుభద్రా పరిణయం — అభిమన్యుడి జన్మ రహస్యంThu, 27 Aug 2026 - 14min
- 26 - Ep-26 అర్జునుడి యుద్ధం — అజ్ఞాతవాసం ముగింపు
భీష్ముడు అజ్ఞాతవాసం ముగిసిందని సభలో ప్రకటించాడు! కర్ణుడు — అశ్వత్థామ మధ్య వాక్సమరం! అర్జనుడు దేవదత్తం శంఖం ఊది యుద్ధరంగంలోకి దూసుకొచ్చాడ!
గురువు ద్రోణాచార్యుడికి నమస్కరచి యుద్ధం మొదలుపెట్టాడు! కృపుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడు, భీష్ముడు — అదరినీ ఒంటరిగా ఓడించడు! సమ్మోహనాస్త్రంతో కౌరవ సేన మొత్తం మూర్ఛపోయింది!
60,000 గోవులు విడుదల! పడవులు విరాటరాజు సభలో అసలు రూపాలు వెల్లడించిన అద్భుత క్షణ!
Thu, 20 Aug 2026 - 12min - 25 - Ep-25 గోగ్రహణం -సుశర్మ దాడి -భీముడి శౌర్యం -శమీ వృక్షం
కీచక వధ వార్త విన్న దుర్యోధనుడు కౌరవ సభలో పెద్ద చర్చ జరిపాడు! భీష్ముడు దాటవేత ధోరణిలో మట్లాడగా — కర్ణుడు, సుశర్మ పాండవులు విరాట నగరంలో ఉన్నారని గర్తించారు!
సుశర్మ దక్షిణం నుండి దాడి చేసి విరాటరాజును బందీ చేశాడు — భీముడు వేలమంది సైనికలను ఒంటరిగా ఓడించి రజును విడిపించాడు!
కౌరవులు ఉత్తర నుండి 60,000 గోవులు దోచకున్నారు — ఉత్తరుడు భయపడ్డాడు — శమీ వృక్షం వద్ద అరనుడు తన పది దివ్య నామాలు వెల్లడించిన అద్భుత సన్నివేశ!
Thu, 13 Aug 2026 - 13min - 24 - Ep-24 కీచక వధ — ద్రౌపది సాహసంThu, 06 Aug 2026 - 13min
- 23 - Ep-23 అజ్ఞాతవాసం
పన్నెండేళ వనవాసం పూర్తయింది! ఇప్పుడు మొదలవతోంది అత్యంత సాహసోపతమైన పదమూడవ సంవత్సరం — అజ్ఞాతవాసం!
యుధిష్ఠిరుడు జూదగాడగా, భీముడు వంటవాడిగా, అర్జునడు నాట్య గురువుగా, నకులుడు గుర్రాల సేవకుడిగా, సహదేవుడు పశువల కాపరిగా, ద్రౌపది పరిచారికగా — ఆరుగురూ వేషలు ధరించి విరాట నగరంలో అడుగుపెట్టారు!
యముడు ఇచ్చిన వరం, శమీ వృక్షంపై దాచిన ఆయుధాలు, దుర్గాదేవ ప్రార్థన — అన్నీ ఈ ఎపిసోడ్లో!
మహాభారత గాథ | విరాట పర్వ | Episode 23
Thu, 30 Jul 2026 - 12min - 22 - Ep-22 యక్ష పశ్నలు — ధర్మరాజు జ్ఞాన పరీక్ష
124 ప్రశ్నలు! అవును — యక్షుడు అడగిన 124 ప్రశ్నలు. జీవితం ఏమిటి? చావు ఏమిటి? నజమైన సంపద ఏమిటి? నిజమైన శత్రువు ఎవరు?
భముడు, అర్జునుడు, నకులుడు, సహదవులు — నలుగుర యక్షుడి హెచ్చరిక వినకుండా నీళ తాగి మూరపోయారు! ఒంటరిగా వెళ్ళిన యుధిష్ఠిరుడు — 124 ప్రశ్నలకు జ్ఞానంతో సమాధానం చెప్పాడు. యక్షుడే సాక్షాత్త యముడు అని తెలిసిన ఆ అద్భుత క్షణం!
వన పర్వం ముగింపు ఎపిసోడ్ — మహాభారతంలో అత్యంత ప్రసద్ధమైన ఘట్టం!
మహాభారత గాథ | వన పర్వం | Episode 22
Thu, 23 Jul 2026 - 14min - 21 - Ep-21 స్వర్గం నుండి తిరిగి వచ్చిన అర్జనుడు
ఐదు సంవత్సరాలు! అంతే — ఐదు సంవతరాల నిరీక్షణ, ఐదు సంవత్సరాల ప్రార్థన, ఐదు సంవతరాల నమ్మకం — చివరిక ఆ క్షణం వచ్చింది!
స్వర్గం నుండి దివ్యాస్తలతో తిరిగి వచ్చిన అర్జునుడు, పాండవులతో భావోద్వగమైన కలయిక, నివాతకవచులతో భీకర యుద కథ, నారద మహర్షి వచ్చి ఆపిన అద్భుత సంఘటన — మరియు సరరూపంలో ఉన్న నహషుడు భీముడిని పటకున్న నాటకీయ ఘట్టం!
Thu, 16 Jul 2026 - 16min - 20 - Ep-20 పుణ్యభూమి పయనం — జటాసుర వధ
దుర్యోధనుడి కుట్రలు, అడవి కష్టాలు — వీటన్నింటినీ దాటి పాండవులు ఇప్పుడు పుణ్యభూముల వైపు అడుగులు వేశారు! లోమాస మహర్షి తోడుగా కురుక్షేత్రం, పవిత్ర గంగ, ముల్లోకాలలో శ్రేష్ఠమైన ప్రయాగ సంగమం — ప్రతి క్షేత్రంలో ఒక కొత్త శక్తి, ఒక కొత్త స్ఫూర్తి!
కానీ ప్రమాదం ఎక్కడైనా పొంచి ఉంటుంది — బ్రాహ్మణ వేషంలో వచ్చిన జటాసురుడు ద్రౌపదిని, పాండవులను అపహరించాడు! సహదేవుడి తెలివి, భీముడి అఖండ శౌర్యం — చూడండి ఈ episode లో!
మహాభారత గాథ | వన పర్వం | Episode 20
Thu, 09 Jul 2026 - 11min - 19 - Ep-19: నలదమయంతి కథ, లోమశ మహర్షి, తీర్థయాత్రలు
ఉర్వశి శాపంతో నపుంసకుడిగా మారిన అర్జునుడికి దేవేంద్రుడు ఇచ్చిన ఓదార్పు ఏంటి? ఇంద్రలోకంలో అర్జునుడు ఐదేళ్ల పాటు గంధర్వ విద్యలు నేర్చుకుంటుంటే... ఇటు భూమిపై అర్జునుడు లేని వెలితితో పాండవులు, ద్రౌపది కామ్యక వనంలో పడిన వేదన ఎలాంటిది?
వారందరినీ ఓదార్చడానికి వచ్చిన బృహదశ్వుడు అనే మహర్షి... ధర్మరాజుకు చెప్పిన అద్భుతమైన మహాభారత ఉప-కథే "నల దమయంతి" కథ!
మహా పుణ్యాత్ముడైన నల మహారాజు శరీరంలోకి 'కలి పురుషుడు' ఎలా ప్రవేశించాడు? దానికి నలుడు కాళ్లు కడుక్కునేటప్పుడు చేసిన ఆ చిన్న పొరపాటే కారణమా? జూదంలో సర్వస్వం కోల్పోయి, అడవిలో దమయంతిని ఒంటరిగా వదిలేసిన నలుడు... చివరకు కార్కోటక సర్పం సహాయంతో, అక్షహృదయ విద్యను నేర్చుకుని తనలో ఉన్న కలి పురుషుడిని ఎలా పారద్రోలాడు? లోమశ మహర్షి రాకతో పాండవుల పుణ్యతీర్థాల యాత్ర ఎలా మొదలైంది?
ఈ ఎపిసోడ్లో నల దమయంతిల కథలోని ఎవరికీ తెలియని ఆసక్తికరమైన आध्यात्मिक రహస్యాలను, మైక్రో-డీటెయిల్స్‌ని ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం!
🎙️ New Episode Every Thursday!
If you love this episode, please share it with your friends and family. Thank you so much for your incredible support for this Mahabharatam series!
Let’s Connect:
Your feedback and suggestions mean the world to me. Please let me know how you liked this episode!
👉 Follow me on Instagram: anu_talks_podcast
📧 Email me for feedback & queries at: mahabharatapodcast4@gmail.com
Feel free to send your questions or drop a DM on Instagram. I would love to hear from you!
Follow & Listen on Spotify and Apple Podcasts! 🌟
Thu, 02 Jul 2026 - 16min - 18 - Ep-18 దివ్యాస్త్రాల వేట — అర్జునుడి తపస్సు, శివుడి అనుగ్రహం
పాండవులపై దుర్యోధనుడి కొత్త కుట్ర — పదివేల మంది అతిథులు, ఖాళీ అక్షయపాత్ర, ద్రౌపది ఆర్తనాదం. కానీ కృష్ణుడు ఒక్క అన్నపు గింజతో అన్నీ తలకిందులు చేశాడు!
అర్జునుడు హిమాలయాలకు వెళ్ళాడు. శివుడు కిరాత రూపంలో పరీక్షించాడు. అహంకారం నేల కూలింది. పాశుపతాస్త్రం లభించింది. స్వర్గంలో ఊర్వశి శాపం వచ్చింది — అది శాపమా, వరమా?
మహాభారత గాథ | వన పర్వం | Episode 18
🎧 Spotify లో follow చేయండి | Share చేయండి!
Instagram
anu_talks_podcast
Thu, 25 Jun 2026 - 23min - 17 - Ep-17: అరణ్యవాసం - శకుని రెండో ఉచ్చు, పాండవుల శపథాలు!
మాయాజూదంలో సర్వస్వం కోల్పోయిన తర్వాత పాండవుల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? ద్రౌపది వస్త్రాపహరణం తర్వాత హస్తినాపురంలో పుట్టిన అపశకునాలు చూసి భయపడిన ధృతరాష్ట్రుడు వరాలు ఇచ్చి పాండవులను విడిపించినా... శకుని వ్యూహం అంతటితో ఆగలేదు!
"అనుద్యూతం" అంటే రెండోసారి జరిగిన జూదంలో శకుని వేసిన ఆ కొత్త ఉచ్చు ఏంటి? 'వినాశకాలే విపరీత బుద్ధి' అన్నట్లుగా ధర్మరాజు మళ్లీ ఆ ఆటకు ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది?
రాజవస్త్రాలను వీడి, నార వస్త్రాలు కట్టి, కన్నీళ్లతో అడవి బాట పట్టిన ఆ ఐదుగురు వీరులు మరియు సామ్రాజ్ఞి ద్రౌపది అరణ్య ప్రస్థానం ఎలా మొదలైంది? కురుసభలో అవమానానికి ప్రతికారంగా భీమార్జునులు చేసిన ఆ భీకర శపథాలు ఏంటి? హస్తినాపురాన్ని విడిచిపెట్టి చిన్నాన్న విదురుడు కామ్యక వనంలో ఉన్న పాండవుల దగ్గరకు ఎందుకు వెళ్లాడు?
మహాభారతంలో అత్యంత ఎమోషనల్ అధ్యాయమైన "అరణ్యవాసం" ప్రారంభాన్ని ఈ ఎపిసోడ్లో పూర్తి అంతరార్థంతో విందాం.
🎙️ ప్రతి గురువారం ఒక కొత్త ఎపిసోడ్‌తో మీ ముందుకు!
మా చిన్న కమ్యూనిటీని సపోర్ట్ చేస్తూ, వింటున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, వ్యూ మరియు ఫీడ్‌బ్యాక్ నాకు ఎంతో అమూల్యమైనవి.
Thu, 18 Jun 2026 - 20min - 16 - Ep-16 శకుని మాయాజూదం - ద్రౌపదీ వస్త్రాపహరణం
మహాభారతం ఎపిసోడ్ 16: శకుని మాయాజూదం - ద్రౌపదీ వస్త్రాపహరణం
:
మహాభారత చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయం, కురువంశ వినాశనానికి అసలైన నాంది ఈ ఎపిసోడ్!
శకుని ఆడిన మాయా పాచికల ఉచ్చులో ధర్మరాజు ఎలా చిక్కుకుపోయాడు? సామ్రాజ్యాన్ని, సంపదను, చివరకు కన్నతమ్ముళ్లను, తనను తాను ఎలా ఒడ్డుకుంటూ వెళ్లాడు? సకల ధర్మాలు తెలిసిన భీష్మ, ద్రోణ, విదురులు ఉన్న ఆ కురుసభలో... ఒక సామ్రాజ్ఞికి జరిగిన ఘోర పరాభవం ఏంటి?
అధర్మం రాజ్యమేలుతూ, వీరులంతా మూగబోయిన ఆ సభలో ద్రౌపది చేసిన ఆక్రందన... ఆమె మానాన్ని కాపాడటానికి ఆ ద్వారకాధీశుడు శ్రీకృష్ణుడు చేసిన అక్షయ వస్త్ర లీల... వినే ప్రతి ఒక్కరి గుండెలను పిండేసే ఈ హృదయవిదారక ఘట్టాన్ని ఈ ఎపిసోడ్లో పూర్తి అంతరార్థంతో, ఎమోషనల్‌గా విశ్లేషించుకుందాం.
ఈ ఎపిసోడ్‌లోని ముఖ్య ముఖ్యాంశాలు:
శకుని పగ - పాచికల వెనుక ఉన్న మాయా శక్తులు.
ధర్మరాజు వ్యసనం - జూదంలో సర్వస్వం కోల్పోయిన క్షణాలు.
కురుసభలో ద్రౌపది ప్రశ్నించిన ధర్మ సూక్ష్మాలు.
దుశ్శాసనుడి అనాగరిక చర్య - కృష్ణ పరమాత్మ అభయం.
కురువంశ సర్వనాశనానికి ద్రౌపది చేసిన భీకర శపథం!
For more short videos follow Instagram page
@anu_talks_podcast
#MahabharatamInTelugu #TeluguPodcast #Episode16 #DraupadiVastrapaharanam #Shakuni #KrishnaRemedy #TeluguStoryTelling #AncientIndia #MahabharataLessons
Thu, 11 Jun 2026 - 20min - 15 - Ep- 15: "రాజసూయ యాగం - కృష్ణుడి విశ్వరూపం"
జరాసంధుడు ఎలా పుట్టాడు? 14 రోజులు భీముడిని ఓడించిన అతడిని చివరకు ఎలా చంపారు? కృష్ణుడు ఒక గడ్డి పరక ఎందుకు విసిరాడు? రాజసూయ యాగంలో శిశుపాలుడు 100 నిందలు ఎందుకు తిట్టాడు? కృష్ణుడు ఎందుకు 99 నిందలు భరించి 100వ నిందకే సుదర్శన చక్రం విసిరాడు? మహాభారతంలో అత్యంత పవర్ఫుల్ అయిన ఈ రెండు ఘట్టాలను ఈరోజు వినండి!
Sun, 26 Apr 2026 - 14min - 14 - Ep-14 ఇంద్రప్రస్థం - ఎడారిని స్వర్గంగా మార్చిన పాండవులు! | మయసభలో దుర్యోధనుడి అవమానం
పాండవులకు రాజ్యంలో సగం ఇస్తామని చెప్పి, ధృతరాష్ట్రుడు వారికి ఇచ్చింది ఏమిటి? ఒక భయంకరమైన ఎడారి! కానీ, ఆ అడవిని ప్రపంచం ఆశ్చర్యపోయే **'ఇంద్రప్రస్థం'**గా పాండవులు ఎలా మార్చారు?
ఈ ఎపిసోడ్లో మీరు వినబోయే ఆసక్తికరమైన అంశాలు:
ఖాండవ దహనం: అర్జునుడు తన సొంత తండ్రి, దేవేంద్రుడినే ఎదిరించి యుద్ధం చేసిన ఘట్టం.
గాండీవ ప్రాప్తి: అగ్నిదేవుడు అర్జునుడికి అజేయమైన 'గాండీవం' ఎందుకు ఇచ్చాడు?
మయసభ: రాక్షస శిల్పి మయుడు నిర్మించిన మాయా లోకం.. అక్కడ నేల ఏది? నీరు ఏది?
ఒక్క నవ్వు - ఒక యుద్ధం: మయసభలో దుర్యోధనుడు పొందిన పరాభవం ఏమిటి? ద్రౌపది నవ్విన ఆ నవ్వు మహాభారత యుద్ధానికి ఎలా బీజం వేసింది?
అసూయ, పగ, మరియు పట్టుదల కలగలిసిన ఈ అద్భుత ఘట్టాన్ని ఇప్పుడే వినండి!
Host: అరుణ (Aruna)
Series: మహాభారత గాథ (Voice of Epics)
#MahabharatamInTelugu #Indraprastha #Arjuna #Mayasabha #Draupadi #TeluguPodcast #VoiceOfEpics #IndianMythology #MahabharataStories #SpiritualTelugu
Sun, 12 Apr 2026 - 18min - 13 - Ep-13 ద్రౌపదీ స్వయంవరం
అగ్నిపుత్రి ద్రౌపది స్వయంవర వేదికపై జరిగిన సంచలనం ఏమిటి? అర్జునుడు మత్స్య యంత్రాన్ని కొట్టిన తర్వాత రాజసభ ఎందుకు రణరంగంగా మారింది? కుంతీ దేవి తెలియక అన్న ఆ ఒక్క మాట పాండవుల మరియు ద్రౌపది జీవితాలను ఎలా మార్చేసింది? ఇది విధి లిఖితమా లేక పొరపాటా? ఈ విశేషాలన్నీ నేటి ఎపిసోడ్ 'మత్స్యయంత్ర భేదనం'లో మీకోసం!
Tue, 31 Mar 2026 - 12min - 12 - Ep-12 బకాసుర సంహారం - ఏకచక్రపురంలో భీమ పరాక్రమం!
బ్రాహ్మణ వేషధారణలో ఉన్న పాండవులకు ఏకచక్రపురంలో ఎదురైన పరీక్ష ఏమిటి? ఊరి జనాలను పీడిస్తున్న క్రూర రాక్షసుడు బకాసురుడిని భీముడు ఎలా అంతం చేశాడు? కుంతీ దేవి సాహసోపేతమైన నిర్ణయం వెనుక ఉన్న ధర్మం ఏమిటి? వ్యాస మహర్షి చెప్పిన ద్రౌపది జనన రహస్యం ఏమిటి? ఈ ఉత్కంఠభరితమైన గాథను నేటి ఎపిసోడ్లో వినండి!
#Mahabharata #Bhima #Bakasura #Kunti #Vedavyasa #TeluguPodcast #మహాభారతం #తెలుగుపోడ్కాస్ట్
Wed, 25 Mar 2026 - 09min - 11 - Ep-11 అరణ్య పర్వం: భీమ పరాక్రమం - హిడింబి అనురాగం మరియు ఘటోత్కచుడి జననం!
మంటల నుండి తప్పించుకున్నారు.. కానీ మృత్యువు వెంబడిస్తూనే ఉంది!. రాజ సౌధాల్లో పెరిగిన వారు దట్టమైన అడవిలో క్రూర మృగాల మధ్య ఎలా బతికారు?
🔥 ఈ ఎపిసోడ్లో మీరు వినబోయే విశేషాలు:
ఒక్కడే సైన్యం: తన తల్లిని, నలుగురు సోదరులను భుజాలపై మోస్తూ భీముడు అడవిని ఎలా చీల్చుకుంటూ వెళ్ళాడు?
హిడింబాసురుడి ఆకలి: మానవ మాంసం కోసం వచ్చిన రాక్షసుడిని భీముడు ఎలా మట్టికరిపించాడు?
మాయావి హిడింబి: రాక్షస రూపం వదిలి సుందరాంగిగా మారిన హిడింబి.. భీముడిని చూసి ఎందుకు మనసు పారేసుకుంది?
ఘటోత్కచుడి జననం: పుట్టిన క్షణమే యువకుడిగా పెరిగిన పాండవుల తొలి సంతానం ఘటోత్కచుడి అద్భుత శక్తులు ఏమిటి?
నిబంధనలతో కూడిన వివాహం: ధర్మరాజు విధించిన ఆ షరతు ఏమిటి?
✨ ఈ కథాంశం నుండి మనం నేర్చుకోవాల్సింది: కష్టాల్లో ఉన్నప్పుడు బంధుబలమే మనకు అతిపెద్ద శక్తి అని, అలాగే ప్రేమకు కులమతాలు, జాతులు ఉండవని ఈ ఘట్టం నిరూపిస్తుంది.
తదుపరి ఎపిసోడ్లో: ఏకచక్రపురంలో పాండవుల భిక్షాటన మరియు బకాసురుడి భయంకరమైన ఆకలి కథను తెలుసుకుందాం!
Sun, 15 Mar 2026 - 08min - 10 - Ep-10 లక్షాగృహ దహనం: కుట్రల మంటల్లో పాండవులు - బ్రహ్మాస్త్ర రహస్యం
ఈ ఎపిసోడ్లో మీరు వినబోయే ప్రధాన అంశాలు:
బ్రహ్మశిరోస్త్రం: ద్రోణాచార్యుడు అర్జునుడికి మాత్రమే ఎందుకు ఈ దివ్యాస్త్రాన్ని ఉపదేశించాడు? దాని శక్తి మరియు నిబంధనలు ఏమిటి?
కణిక నీతి: ధృతరాష్ట్రుడి మనసును మార్చిన కణికుడి విషపూరితమైన రాజకీయం ఏమిటి?
మరణ యంత్రం - లక్షాగృహం: వారణావతంలో పురోచనుడు నిర్మించిన లక్క ఇంటి వెనుక ఉన్న భయంకరమైన ఇంజనీరింగ్ రహస్యాలు.
విదురుడి గూఢ భాష: విదురుడు 'మ్లేచ్ఛ' భాషలో ధర్మరాజుకు పంపిన రహస్య సందేశం ఏమిటి? అది పాండవులను ఎలా కాపాడింది?
ఆ రాత్రి.. అగ్ని ప్రళయం: లక్క ఇల్లు తగలబడుతున్నప్పుడు భీముడు తన కుటుంబాన్ని మృత్యువు నోటి నుండి ఎలా బయట పడేశాడు?
అజ్ఞాతవాసానికి నాంది: లోకం దృష్టిలో పాండవులు మరణించారు, కానీ అడవిలో వారి కొత్త ప్రయాణం ఎలా మొదలైంది?
Tue, 27 Jan 2026 - 12min - 9 - Ep-9 ద్రోణుడు-ద్రుపదుడి కథ
'మహాభారత గాథ' లోని ఈ అత్యంత నాటకీయమైన భాగంలో, రాజదర్పాన్ని, అహంకారాన్ని మరియు ప్రతీకారాన్ని తెలుసుకుందాం.
ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న ద్రోణాచార్యుడు మరియు పాంచాల రాజు ద్రుపదుడు ఎలా శత్రువులుగా మారారు? ఒక పేదరికం, ఒక అహంకారపూరితమైన మాట... ద్రోణుడి మనసులో విషపు శల్యమై ఎలా మారింది?
⚔️ ఈ ఎపిసోడ్లో లోతుగా విశ్లేషించబడిన అంశాలు:
స్నేహం నుండి శత్రుత్వం వరకు: ద్రుపదుడు తన బాల్య స్నేహితుడైన ద్రోణుడిని రాజసభలో అవమానించడానికి గల అసలు కారణాలు.
అశ్వత్థామ పాల కథ: తన కుమారుడి దారిద్రాన్ని చూసి ద్రోణుడు పడిన ఆవేదన మరియు ప్రతీకార శపథం.
గురువు ఆజ్ఞ: ద్రోణుడు తన శిష్యులైన కౌరవ పాండవుల ద్వారా గురుదక్షిణగా ద్రుపదుడిని బంధించి తీసుకురమ్మని ఎందుకు అడిగాడు?
కౌరవుల అపజయం: దుర్యోధనుడు మరియు కర్ణుడి సైన్యం ద్రుపదుడి ముందు ఎందుకు ఓడిపోయింది? అర్జునుడు ఎలా విజయం సాధించాడు?
ప్రతీకారం యొక్క పరిణామాలు: ద్రోణుడి ప్రతీకారం ద్రుపదుడి అహంకారాన్ని అణచివేసిందా, లేదా మరొక భయంకరమైన పగకు నాంది పలికిందా?
✨ ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి: అహంకారం (Ego) ఎంతటి గొప్ప సంబంధాన్ని అయినా ఎలా నాశనం చేయగలదు, మరియు ప్రతీకారం అనేది ఎప్పుడూ అంతం కాని విషవలయం ఎలా అవుతుందో తెలుసుకుందాం.
తరువాత భాగంలో: ద్రుపదుడి అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి అతను చేసిన భయంకరమైన యాగం మరియు ఆ యాగం నుండి ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు ఎలా జన్మించారో తెలుసుకుందాం!
#MahabharataGatha #TeluguPodcast #Drona #Drupada #GuruDakshina
Sun, 23 Nov 2025 - 07min - 8 - Ep-8 దానవీరశూరకర్ణSat, 15 Nov 2025 - 04min
- 7 - EP-7 గురు ద్రోణాచార్యుల విద్యాబోధన - విలువిద్యలో అర్జునుడి ప్రావీణ్యం మరియు ఏకలవ్యుడు
ఈ ఎపిసోడ్లో మీరు తెలుసుకోబోతున్న కథలు రెండు!
🟠 ఏకలవ్యుడు – గురువు లేకుండానే ధనుర్విద్యలో నిపుణుడై, అర్జునుని కూడా ఆశ్చర్యపరిచిన అరణ్య వీరుడు.
🟠 కర్ణుడు – తన జన్మరహస్యంతో కూడిన శక్తిమంతుడు, అర్జునుని సమానంగా ధైర్యంగా నిలిచిన సూర్యపుత్రుడు.
ఈ ఇద్దరూ అర్జునుని జీవితంలో ముఖ్యమైన సవాళ్లుగా మారారు. ఈ కథలు మనకు నిబద్ధత, గురుభక్తి, ధైర్యం, మరియు స్వభిమానం గురించిన విలువలను నేర్పిస్తాయి.
Sun, 03 Aug 2025 - 10min - 6 - EP-6 పాండవుల - కౌరవుల బాల్యం|| Mahabharatam
ఈ ఎపిసోడ్లో మనం శ్రద్ధగా వినదగ్గ అంశాలు:
📍 హస్తినాపురం లో కౌరవుల రాజసభ జీవితం
📍 అరణ్యంలో పాండవుల బాల్యం – ధర్మ బోధ, విద్యాభ్యాసం
📍 ద్రోణాచార్యులు గురుకుల శిక్షణ ప్రారంభం
📍 అర్జునుడి ఏకాగ్రతకు గుర్తుగా "పక్షి కన్ను" ఘట్టం
📍 దుర్యోధనుడి అసూయ, భీముడిపై కుట్ర
📍 భీముడి నాగలోక ప్రయాణం – ఎనిమిది రోజులు, శక్తినిచ్చే పానీయాలు
📍 చివరగా – మనం తెలుసుకోవాల్సిన విలువైన జీవన పాఠం!
Tue, 15 Jul 2025 - 10min - 5 - EP-5 Kuruvamsam MAHABHARATAM
పాండురాజు శాపం కారణంగా అరణ్యవాసంలో ఉన్నప్పటికీ, దేవతల ఆశీస్సులతో పాండవులు జన్మించారు. అదే సమయంలో హస్తినాపురంలో గాంధారి కోపంతో చేసిన ఒక చర్య వలన, 100 మంది కౌరవులు జన్మించడమనే అసాధారణ సంఘటన జరిగింది. ఈ ఎపిసోడ్లో, శాపం, వరం, కోపం, ఆశ—ఇవి అన్ని కలిసిన వాస్తవాలు మన కURU వంశం భవిష్యాన్ని ఎలా ప్రభావితం చేశాయో తెలుసుకుందాం.
Tue, 01 Jul 2025 - 11min - 4 - EP-4 కురు వంశం
ఈ ఎపిసోడ్లో హస్తినాపురం వారసత్వ సమస్యపై సత్యవతి తీసుకున్న ధైర్యమైన నిర్ణయం, వ్యాస మహర్షి ఆహ్వానం, అంబిక, అంబలిక, దాసితో జరిగిన నీయోగం కథను తెలుసుకుంటాం. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుల జన్మం, వారి స్వభావం, భవిష్యత్తుకు బలమైన పునాది ఎలా అయిందో తెలుసుకోండి. ధర్మం, భయం, గౌరవం, జ్ఞానం – ఇవన్నీ ఎలా వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయో ఈ భాగంలో తెలుస్తుంది. చివరగా, పాండవుల జననం దిశగా కథ ఎలా ముందుకెళ్తుందో తెలుసుకోండి.
Sun, 22 Jun 2025 - 10min - 3 - Mahabhratam (EP-3)Sat, 14 Jun 2025 - 11min
- 2 - Mahabharatam (EP-2)Tue, 10 Jun 2025 - 05min
- 1 - Ep-1 MahabharatamSat, 07 Jun 2025 - 03min
Podcasts similaires à మహాభారతం – కథల రూపంలో(Mahabharatam – Kathala Roopamlo)
El Partidazo de COPE COPE
Herrera en COPE COPE
La Linterna COPE
Dante Gebel Live Dante Gebel
Es la Mañana de Federico esRadio
La noche de Cuesta esRadio
La Trinchera de Llamas esRadio
Hondelatte Raconte Europe 1
Affaires sensibles France Inter
LEGEND Guillaume Pley
El colegio invisible OndaCero
La Rosa de los Vientos OndaCero
Les grands dossiers de l'Histoire par Franck Ferrand Radio Classique
Espacio en blanco Radio Nacional
Enquêtes criminelles RTL
Entrez dans l'Histoire RTL
Le grand récit RTL
Les Grosses Têtes RTL
L'Heure Du Crime RTL
Parlons-nous RTL
El Larguero SER Podcast
SER Historia SER Podcast
Todo Concostrina SER Podcast
Un Libro Una Hora SER Podcast