Filtrar por gênero

TALRadio Telugu

TALRadio Telugu

Touch A Life Foundation

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

994 - అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 1 | అంతరంగాలు - 12
0:00 / 0:00
1x
  • 994 - అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 1 | అంతరంగాలు - 12

    ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే మనసు ఆమెది!


    అప్పుడామె ఐదో తరగతి చదువుతున్నారు. ఒకరోజు నాన్న చెప్పిన పని మీద సైకిల్‌పై దుకాణానికి వెళ్తుండగా.. దారిలో ఓ వృద్ధుడి కాలికి గాయం కావడంతో నడవలేక రోడ్డుపై ఉండటం చూశారు. వెంటనే తన పనిని పక్కనపెట్టి, రిక్షా తీసుకొచ్చి ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆయనకు అవసరమైన మందులు కూడా కొనిచ్చారు. చిన్న వయసులో తాను చేసిన ఈ సహాయమే తన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందట! ఇప్పుడు అదే సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు… సీతామహాలక్ష్మి గారు!


    ఎదుటివారికి సహాయం చేయడం అంటే కేవలం మన దగ్గర ఉన్నదాన్ని ఇవ్వడమే కాదు.. మన జీవితం ముగిశాక కూడా మరొకరికి జీవితాన్ని అందించవచ్చని చెబుతున్నారు ఈ టీచర్!


    సావిత్రిబాయి జీవితం నుండి స్ఫూర్తి పొందిన వీరు అవయవదానం ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా బాడీ ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ను స్థాపించి, ఒక ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాకుండా.. సమాజానికి ఉపయోగపడే విషయాలపై అవగాహన కల్పించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.


    మరి ఈ సంస్థను ప్రారంభించాలనే ఆలోచన ఆమెకు ఎలా వచ్చింది? అవయవదానం గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో ఆమె సాగిస్తున్న సేవా ప్రయాణం ఎలా ఉంది? తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పాడ్కాస్ట్ తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!


    Inspired by a childhood incident where she helped an injured elderly man, Seethamahalakshmi Garu has dedicated her life to serving society. Inspired by Savitribai Phule, she founded the All India Body Organ Donors Association to create awareness about organ donation. Along with being a teacher, she actively educates students and the public about the importance of organ donation and how one person's decision can save many lives. Discover her inspiring journey, social initiatives, and mission in this week's episode of Antharangalu Podcast.


    Guest: గూడూరు సీతామహాలక్ష్మి

    Founder & President,

    All India Body Organ Donors Association

    Host: డా|| శోభా పేరిందేవి


    #TALRadioTelugu #Antharangalu #OrganDonation #Seethamahalakshmi #SocialService #InspiringStories #TouchALife #TALRadio

    Tue, 03 Nov 2026 - 30min
  • 993 - మా పాలకొల్లు చాలా అందమైన ఊరు! | మా ఊరు - 86

    చిన్ననాటి స్నేహాలు.. మరచిపోలేని జ్ఞాపకాలు!


    చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు, వీధుల్లో కలిసి ఆడుకున్న ఆటలు, పండుగలు, సరదాలు.. ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలు. బాల్యంలో స్నేహితులతో గడిపిన ఆ రోజులను గుర్తుచేసుకుంటే మనసంతా ఆనందంతో నిండిపోతుంది. అంటూ… వాళ్ళ ఊరు పాలకొల్లు గురించి, తన చిన్ననాటి జ్ఞాపకాల గురించి ఈ వారం మా ఊరు కార్యక్రమంలో ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు… ప్రముఖ సోషల్ వర్కర్ శశికళ గారు!


    వారి వీధిలో ఉన్న స్నేహితులతో కలిసి చదువుకోవడం, క్విజ్‌లు, డిబేట్లలో పోటీపడటం, సాయంత్రం వేళల్లో ఆటలతో సందడి చేయడం.. ఇలా ఎన్నో సరదా అనుభవాలను గుర్తుచేసుకున్నారు.


    అంతే కాకుండా, వాళ్ళ నాన్న చేసిన బట్టల వ్యాపారం గురించి, ముంబాయి నుంచి తీసుకొచ్చే కొత్త కొత్త దుస్తుల గురించి, తన సొంత ఊరితో ఉన్న అనుబంధాల గురించి కూడా పంచుకున్నారు.


    తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!


    English Summary:


    Childhood friendships and memories hold a special place in our hearts! From playing with friends in the streets to celebrating festivals and sharing joyful moments, these experiences remain unforgettable.


    In this week’s episode of Maa Ooru, renowned social worker Shashikala Garu takes us on a nostalgic journey through her childhood in Palakollu. She recalls studying with neighborhood friends, participating in quizzes and debates, and enjoying fun-filled evenings playing together.


    She also shares memories of her father’s clothing business, the fashionable outfits he brought from Mumbai, and her deep emotional connection with her hometown.


    Tune in to this heartwarming episode filled with childhood memories, friendships, and the beautiful bond with one’s roots. Don’t miss it!


    Guest: Sashikala Voora,

    Home Maker & Social Activist

    Host: Usha


    #TALRadioTelugu #MaaOoru #ChildhoodMemories #Palakollu #NostalgicMemories #TouchALife #TALRadio

    Mon, 02 Nov 2026 - 30min
  • 992 - Vegan Lifestyle: అపోహలు – వాస్తవాలు! | స్పూర్తి కిరణాలు | World Vegan Day Special

    ఓ చిన్న సంఘటన.. ఆయన ఆహారపు అలవాట్లనే మార్చేసింది!


    2020లో కరోనా లాక్‌డౌన్ టైమ్ లో పాలు కొనడానికి ఓ డెయిరీ ఫామ్‌కు వెళ్లారు సూరజ్ సీతారామ గారు. అక్కడ దూడలను తల్లుల నుంచి వేరు చేస్తున్న విధానాన్ని చూసి ఎంతో బాధ పడ్డారు. ఆ ఒక్క సంఘటనతో పాలు, పాల ఉత్పత్తులను కొనడమే మానేశారు. ఆ తర్వాత మాంసాహారానికి కూడా దూరమై, పూర్తిగా వీగన్‌గా మారిపోయారు. ఆరోగ్యం కోసం కాదు.. జంతువుల పట్ల ప్రేమతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట!


    మరి అసలు వీగనిజం అంటే ఏమిటి? శాకాహారానికి, వీగన్ ఆహారపు అలవాట్లకు మధ్య తేడా ఏంటి? పాలు, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులకు బదులుగా మనం ఎలాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు? జంతు సంరక్షణ, పర్యావరణ పరిరక్షణలో వీగనిజం ఎలాంటి పాత్ర పోషిస్తుంది? వంటి ఎన్నో విషయాలను వీగన్స్ ఆఫ్ తెలంగాణా సంస్థ ఫౌండర్ సూరజ్ సీతారామ గారు తన అనుభవాలను, ఆలోచనలను ఈ ఇంటర్వ్యూలో మనతో పంచుకున్నారు.


    ప్రపంచ వీగన్ డే సందర్భంగా వీగనిజం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఈ ప్రత్యేక పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!


    One small incident completely changed Suraj Seetharama’s food habits and lifestyle. During the COVID-19 lockdown in 2020, he witnessed calves being separated from their mothers at a dairy farm. Deeply disturbed by the incident, he decided to stop consuming milk and dairy products. Later, he also gave up meat and embraced a completely vegan lifestyle, driven by his love and compassion for animals rather than health reasons.


    In this special World Vegan Day podcast, Suraj Seetharama, Founder of Vegans of Telangana, shares his journey and explains what veganism means, how it differs from vegetarianism, plant-based alternatives to dairy products, and the role of veganism in animal welfare and environmental protection.


    Tune in to discover more about veganism and how our everyday food choices can make a difference!


    Guest: Suraj Seetharama

    Founder,Vegans of Telangana

    Host: Adarsh Kumar


    #TALRadioTelugu #WorldVeganDay #Veganism #VegansOfTelangana #AnimalWelfare #SustainableLiving #TouchAlife #TALRadio

    Mon, 02 Nov 2026 - 36min
  • 991 - ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఆరోగ్యం కోసం ఆయుర్వేదం చెప్పే సూత్రాలు! | Health Talk

    ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం తినాలో మాత్రమే కాదు, ఎప్పుడు తినాలో.. ఎలా తినాలో కూడా తెలిసి ఉండాలి!


    ఉదయం లేవగానే కాఫీ తాగడం.. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం.. రోజంతా స్క్రీన్ ముందు గడపడం.. ఇవన్నీ మన రోజువారీ అలవాట్లలో భాగమైపోయాయి. కానీ మన ఆరోగ్యంపై వీటి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా?


    ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. మన శరీర స్వభావానికి సరిపోయే ఆహారం తీసుకోవడం దగ్గర నుంచి.. ఉదయం లేవడం, వ్యాయామం, భోజన సమయాలు, నిద్ర వరకు.. రోజువారీ జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో కొనసాగించడానికీ ఆయుర్వేదం కొన్ని సూచనలు చేస్తోంది.


    అందుకే.. మన రోజువారీ ఆహారం, నిద్ర, వ్యాయామం, భోజనానికి స్నానానికి మధ్య ఉండాల్సిన గ్యాప్, రాత్రి భోజనం, జంక్ ఫుడ్, స్క్రీన్ టైమ్ వంటి ఎన్నో విషయాల గురించి ఈ పాడ్కాస్ట్ లో ఎన్నో విషయాలు మనతో పంచుకున్నారు… ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు Dr. Srujana Komatreddy గారు!


    తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి!


    Ayurveda emphasizes that small daily habits play a significant role in maintaining good health. From choosing food according to our body constitution to maintaining proper routines for waking up, exercise, meals, bathing, and sleep, Ayurveda offers valuable guidance for a healthy lifestyle.


    In this podcast, renowned Ayurvedic expert Dr. Srujana Komatreddy shares useful insights on daily food habits, sleep, exercise, meal timings, the gap between meals and bathing, dinner routines, junk food, screen time, and much more.


    Listen to the podcast and discover simple Ayurvedic practices for a healthier life. Don't miss it!


    Guest :Dr. Srujana Komatreddy

    Ayurvedic Doctor

    Host: Bharath


    #TALRadioTelugu #Ayurveda #HealthyLifestyle #DailyHealthTips #DrSrujanaKomatreddy #TouchALife #TALRadio


    Mon, 02 Nov 2026 - 25min
  • 990 - స్పెషల్ పిల్లల కోసం సాధన సంస్థ | అంతరంగాలు - 11

    “అమ్మ ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆప్యాయత అది!”

    అంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తున్నారు సురేఖారెడ్డి గారు.


    1996లో కేవలం ఇద్దరు పిల్లలతో ప్రారంభమైన ఆమె ప్రయాణం.. ఇప్పుడు వందలాది మంది పిల్లలకు అండగా నిలిచే స్థాయికి చేరింది. నాచారంలోని సాధన స్కూల్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే సంస్థ ద్వారా మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు విద్య, ప్రత్యేక శిక్షణ, వివిధ థెరపీలను అందిస్తున్నారు. ప్రస్తుతం 100 మంది రెసిడెన్షియల్ విద్యార్థులతో పాటు, 120 మంది డే స్కాలర్లకు సేవలందిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చిన్న వయసులోనే తీసుకొచ్చి శిక్షణ పొందేలా ఎర్లీ ఇంటర్వెన్షన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు.


    ఈ పిల్లలనే తన కుటుంబంగా భావిస్తూ, వారికి ఓ సరికొత్త వాతావరణం కల్పిస్తున్నారు. తల్లిదండ్రులు లేని పిల్లల బాధ్యతను కూడా తీసుకుని, వారి బాగోగులు చూసుకుంటున్నారు.


    మరి సురేఖారెడ్డి గారు ఈ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించారు? ఇన్నేళ్లుగా వందలాది మంది పిల్లలకు ఎలా తోడుగా నిలుస్తున్నారు? వారి కోసం ఎలాంటి సేవలు చేస్తున్నారు? తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పాడ్కాస్ట్ ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!


    A Mother’s Love Knows No Age!


    Since 1996, Surekha Reddy has been a loving support system for children with intellectual disabilities. Through Sadhana School for Differently Abled in Nacharam, she provides education, special training, and various therapies to help children develop essential life skills. Today, the institution serves 100 residential students and 120 day scholars, along with offering early intervention programs for young children. She also takes responsibility for children who have lost their parents, treating every child as her own family.


    How did Surekha Reddy begin this inspiring journey? What challenges has she overcome, and how is she transforming the lives of these children? Listen to this week's Antharangalu podcast to discover her heartwarming story of love, care, and dedication.


    Guest: సురేఖా రెడ్డి ,

    వ్యవస్థాపకులు ,

    సాధన మానసిక దివ్యాంగుల సంస్థ

    Host: డా|| శోభా పేరిందేవి


    #TALRadioTelugu #Antharangalu #SadhanaSchool #InclusiveEducation #SpecialNeedsChildren #InspiringStories #TouchALife #TALRadio

    Tue, 27 Oct 2026 - 20min
Mostrar mais episódios