Filtrar por género

తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవం

SBS

తెలుగు రచయితల ఆలోచనాధారలో మార్పులు తెచ్చి సాహిత్య ప్రవాహాన్ని గ్రాంధిక భాష నుంచి వ్యావహారిక భాషకు మరల్చిన వ్యావహారిక భాషా పితామహుడు, అభినవ వాగమశాసనుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. 1919లో ‘తెలుగు’ అనే మాసపత్రికను స్థాపించి మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో పురోగతి సాధించాలంటే వాడుక భాషలో పాఠ్యగ్రంధాలుండాలని వ్యావహారిక భాషావాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లారు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే, భాషాభివృద్ధిని కొంతపుంతలు తొక్కించిన వ్యావహారిక భాషా కర్షకుడు గిడుగు రామ్మూర్తి పంతులుగారు. వారి జన్మదినమైన ఆగష్టు 29వ తేదిని తెలుగు జాతి అంతా తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకుంటోంది. ఈ తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకొని, తెలుగ భాష ఔనిత్యాన్ని చాటే కార్యక్రమాలను ఈ నెలలో ప్రతి గురువారం SBS తెలుగు భాషాభిమానులకు, తెలుగు శ్రోతలకు అందించనుంది.

17 - తేనెలూరు తెలుగు Ep11 : కాదేదీ పేరడీకి అనర్హం
0:00 / 0:00
1x
  • 17 - తేనెలూరు తెలుగు Ep11 : కాదేదీ పేరడీకి అనర్హం

    పేరడీ అనే పదం గ్రీకు శబ్ధం పేరోడియా నుంచి పుట్టుంది. అంటే అనుసరించి పాడుట అని అర్ధం. తెలుగు భాషలో ఇతర భాషల నుంచి వచ్చి ఎన్నో పదాలు చేరిపోయినట్టే, ఈ పదము వచ్చి చేరిపోయింది. మాచిరాజు దేవీప్రసాదుగారు పేరిడీకి ‘వికటకవిత్వం’ అని నామకరణ చేసినప్పటికీ, పేరిడీలోని అనేక లక్షణాలు ఈ పదంలో ఇమడకపోవడంతో పేరడీగానే మిగిలిపోయింది.

    #sbsaudiopodcast


    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Fri, 20 Nov 2026 - 10min
  • 16 - తేనెలూరు తెలుగు Ep10 : పదాలు- అపార్థాలు..

    తెలుగుభాషకు సంబంధించిన అనేక విషయాలు తేనెలూరు తెలుగు కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే నేడు మన భాషలోని మరిన్ని సొగసులు, తెలుగు పదాల అర్థాలలో అపార్థాలు, అక్షరాలు మారితే మారే అర్థాలు వగైరాల గురించి ముచ్చటిచ్చుకుందాం.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Fri, 30 Oct 2026 - 06min
  • 15 - తేనెలూరు తెలుగు Ep9 : జాను తెలుగు జాతీయాలు

    ప్రతి భాషకి జీవనాడి వంటివి ఆ భాషలోని జాతీయాలు, నానుడులు, పలుకుబళ్లు. తర,తరాలుగా జనపథంలో వాడుకలో ఉన్న పదప్రయోగాలు, పదబంధాలు వినూత్నమైన భావాన్ని వ్యక్తీకరిస్తాయి. అలాంటి నుడికారాలని, పదబంధాలనే జాతీయాలు అంటాము. చాలామంది జాతీయాలు, సామెతలు ఒకటేనని పొరబడుతుంటారు. కానీ అవి రెండు ఒకటి కాదు. జాతీయాలు ప్రత్యేకంగా ఒక జాతికి సంబంధించిన విశిష్టమైన పలుకుబడి. ఆంగ్లంలో వీటినే ‘ఇడియం’ అంటారు.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Fri, 23 Oct 2026 - 06min
  • 14 - తేనెలూరు తెలుగు Ep8 : సొగసైన జంటపదాలు

    మనం ఎవరినైనా ఉద్దేశించి చెప్పేటప్పుడు, బాంధవ్యాల గురించి ఉదహరించేటప్పుడు, దేనినైనా వర్ణించేటప్పుడు అన్యాపదేశంగా కొన్నిపదాలు ఉపయోగిస్తాం. అమ్మనాన్న, అక్కచెల్లి, అన్నాతమ్ముడు, ఇల్లువాకిలి, గుడిగోపురం, కట్టుబొట్టు, తోడునీడ, పనిపాట, రాధాకృష్ణులు ఇలా అన్నమాట. ఇలాంటి పదాలలో రెండు పదాలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు పలుకుబడిలో ఇలాంటి పదాలను జంటపదాలు అని పిలుస్తాం.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Fri, 16 Oct 2026 - 05min
  • 13 - తేనెలూరు తెలుగు Ep7 : తెలుగుతో దోబూచులాడుతున్న అన్యభాషా పదాలు..

    ‘జనని సంస్కృతంబు సకల భాషలకును’ – ఈ విషయంపై భాషాకోవిదులలో విబేధాలున్నప్పటికీ, భాష అని మనం పదే, పదే పలికే ఈ మాట సంస్కృత పదమే, తెలుగుకాదు. తెలుగులో అయితే బాస అనాలి. తెలుగు భాష సంస్కృతం నుంచి పుట్టిందా లేక కేవలం దవ్రిడ భాషా అనే మీమాంసలు పక్కనపెడితే, మన భాష సంస్కృతం, ప్రాకృతం, తమిళం, కన్నడం, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచి, ఉర్ధూ, అరబిక్, పర్షియన్, హిందీ, చివరగా ఇంగ్లీషు ఈ భాషలన్నింటి వల్ల ప్రభావితం చెందడమేకాదు, ఆ భాషలోని పదాలను సొంతం చేసుకుని, ఇంపుగా తనలో పొదువుకుంది.

    #sbsaudiopodcast

    SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

    Fri, 09 Oct 2026 - 08min
Mostrar más episodios